Wheat Flour Halwa// Healthy sweet


ఈ హల్వాను ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఏ ప్రిపరేషన్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు



 గోధుమపిండి హాల్వ


ఈ హల్వాను ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఏ ప్రిపరేషన్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు కూడా. అమృతసర్ స్పెషల్ హల్వా ఇది. సులువైన ఈ పద్ధతిని ఫాలో అయితే ఎవరైనా ఈ హల్వాని పర్ఫెక్ట్ గా చేయడానికి అవుతుంది. ఇందులో ఉండే బెల్లం మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. అదే విధంగా ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది. చూడడానికి ఎంతో అందంగా కనబడుతుంది. అలానే రుచి గా కూడా ఉంటుంది. తయారీ కి


కావలసిన పదార్థాలు 


  • 3/4 కప్పు గోధుమపిండి 

  • 1/2 కప్పు నెయ్యి

  • 1/2 కప్పు బెల్లం

  • ½ చెంచా యాలకులు పొడి 

  • 1 కప్పు నీళ్ళు

  • 10 నుండి15బాదం పప్పులు 

  • 10 నుండి 15 పిస్తా పప్పు

  • 10 నుంచి 15 జీడిపప్పు 


తయారీ విధానం


  • ముందుగా ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు మరియు పిస్త పప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 

  • అదే  పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని దానిలో గోధుమ పిండి వేసి నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కక ముందే పిండి వేయాలి గుర్తుంచుకోండి. పిండి రంగు మారే వరకూ వేయించాలి. 

  • ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకోవాలి. దానిలో వేడి నీళ్ళని వేసి కలుపుకోవాలి. ఐదు నిముషాలు పాటు అలా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి.. ఆ తరువాత 

  • ఈ బెల్లం నీటి ని వేయించుతూ ఉన్న గోధుమపిండి లో వేస్తూ కలపాలి చాల త్వరగా కలపాలి లేదంటే గోధుమపిండి ఉండలు కడుతుంది. 

  • ఈ విధంగా బెల్లం నీటిని పోసి కలపాగానే హాల్వ దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో 

2 చెంచాలు నెయ్యి వేసి బాగా కలిపి తరువాత యాలుకలపొడి, ముందుగా వేయించి ఉంచుకున్ను జీడిపప్పు, బాదం పప్పులు మరియు పిస్త పప్పులు వేసి కలిపాలి. 

వేడి వేడిగా రుచికరమైన హల్వాని సర్వ్ చేయడానికి సిద్ధం. 


         ఈ హల్వ fridge లో రెండు రోజుల పాటు ఉంటుంది. తినాలని అనిపించినప్పుడు fridge లో నుండి తీసి వేడి చేసుకుని తినవచ్చు. పైగ ఈ హల్వ వేడిగా ఉన్నప్పుడు మరింత రుచిగా ఉంటుంది. 

Comments

Popular Posts