How to make curry leaves powder?
కరివేపాకు కారం :ఈ కారం పొడి ఇడ్లీ తో లేదా ఏరకమైన వేపుడు కూరలో వేసిన చాలా రుచిగా ఉంటుంది. పైగా మనం ఏకూరలో వేసిన తీసి పక్కన పెడుతూ ఉంటాము,కాని ఈ రకంగా కూరలో ఉపయెగిస్తే పిల్లలతో కూడా తినిపించవచ్చు.
కరివేపాకు కారం తయారీ విధానం మరియు కావలసిన పదార్థాలు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
కరివేపాకు ఒక కప్పు
ఎండు మిరపకాయలు 20 నుంచి 30
జీలకర్ర ఒక చెంచా
ఉప్పు తగినంత
నూనె ఒక చెంచా
తయారీ విధానం :
ముందుగా కరివేపాకు(curry leaves) ను శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింది ఆరపెట్టాలి. కరివేపాకు తేమ మొత్తం పూర్తిగా పోయున తరువాత పొయ్యి మీద కడాయి పెట్టి ఒక చెంచా నూనె వేసి కరివేపాకు వేసి బాగా వేయించాలి, అలా వేయించిన కరివేపాకు ను పక్కన పెట్టి అదే కడాయి లో ఒక చెంచా జీలకర్ర వేసి వేయించాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉప్పు మరియు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తరువాత అందులో వేయించిన కరివేపాకు వేసి మిక్సీ పెట్టుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే ఆరోగ్య పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉండే కరివేపాకు కారం(curry leaves powder) సిద్ధం.
ఈ కిందవి కూడా చూడండి :
How to make paneer green peas masala curry?
How to make channa masala? High protein channa masala
ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఒక అద్భుతమైన కూర సెనగలతో, ఎర్ర సెనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
0 Comments