Face Pack For Above 30 Years
వయస్సు 30 పైబడిన వారు యవ్వనము గా కనిపించడానికి తప్పనిసరిగా వాడవలసి పొడి. ఎటువంటి దుష్ప్రభావం లేకుండా.
ఫేస్ ప్యాక్
ఆడవాళ్లు అందంగా మరియు యవ్వనము గా కనిపింఛడానికి చాలా రకాల products ఎంతో ఖర్చు చేసి ఉపయోగిస్తారు. కాని chemicals ఎక్కువ గా ఉండే ఇటువంటి ఉత్పత్తులను వాడటం వలన మనం కొరుకున్న మార్పు రాకపోగా చర్మం మరింతగా పాడువుతుంది. ఎంతో కొంత మార్పు వచ్చిన అది తాత్కాలిక మార్పు మాత్రమే.
మన ఇంట్లో ఉండే మూడు వస్తువులతో మన చర్మం యవ్వనము గా కనిపించే లా ఏ వస్తువుల ను ఎలా ఉపయెగించాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
వేరుశనగ పప్పులు (చెట్ని పప్పులు) :మూడు చెంచాలు
అవిసగింజలు :మూడు చెంచాలు
బాదంపప్పు :రెండు
పాలు లేదా రోజ్ వాటర్ లేదా రైస్ వాటర్ లేదా మంచి నీళ్లు
తయారీ విధానం :
వేరుశనగ పప్పులు, అవిసగింజలు మరియు బాదం పప్పులు లను ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
గమనిక : ఈ పౌడర్ చాలా మెత్తగా ఉండాలి అవసరం అని పిస్త జల్లిడ పట్టుకోవాలి. ఈ పొడి బరకగా ఉండకూడదు బరకగా ఉంటే అది scrub లాగా ఉంటుంది scrub ని ప్రతి రోజూ వాడటం అంత మంచిది కాదు. ఈ పొడి ని క్రమం తప్పకుండా రోజూ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది కావున ఈ పొడి చాలా మెత్తగా ఉండాలి.
వాడే విధానం :
తయారు చేసుకున్న పొడిని రెండు చెంచాలు ఒక చిన్న గిన్నెలో తీసుకుని అందులో పాలు లేదా రోజ్ వాటర్ లేదా రైస్ వాటర్ లేదా మంచినీళ్ళు మీకు ఏది వీలుగా ఉంటే అది వేసి పేస్టులాగా చేసి ముఖం పైన అప్లై చేసి రెండు నిమిషాలు ఉంచి తరువాత నీటి తో తడిపి మర్దన చేస్తూ ముఖం ని శుభ్రం చేసుకోవాలి.
రోజు రాత్రి పూట ఈ విధంగా చేస్తే మీ ముఖం పైన ఉండే మృత కణాలు (dead skin) తొలగిపోతాయు యవ్వనము గా కనిపిస్తుంది.
పైన చెప్పిన కొలతలో చేసిన పొడి నాలుగు లేదా ఐదు రోజుల పాటు వస్తూంది. కావున మొదట ఈ కొలతలో తయారు చేసి క్రమం తప్పకుండా ఈ ఐదు రోజుల వాడితే మార్పు మీరే గమనికస్తారు.
ఖర్చు తక్కువ తో ఎటువంటి సైడ్ ఎఫక్టుసు లేకుండా యవ్వనము గా కనిపించే చర్మం మీ సొంతం. వయస్సు 30 పైబడిన వారు యవ్వనము గా కనిపించడానికి తప్పనిసరిగా వాడవలసి పొడి.
ఎటువంటి దుష్ప్రభావం లేకుండా.
Comments
Post a Comment