వైట్ సాస్ బ్రోకలీ//White sauce broccoli

 

వైట్ సాస్ బ్రోకలీ 

కావాల్సిన పదార్థాలు:

  • 1 కప్పు బ్రోకలీ (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
  • ½ కప్పు స్వీట్ కార్న్ ( ఉడికించినది)
  • 1 టేబుల్ స్పూన్ వెన్న (Butter)
  • 2 స్పూన్లు మైదా లేదా ఓట్స్ పొడి (హెల్తీ ఆప్షన్ కోసం)
  • 1 కప్పు పాలు
  • 1 స్పూన్ మిరియాల పొడి
  • ½ స్పూన్ ఉప్పు
  • ½ స్పూన్ షుగర్
  • ½ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్
  • ½ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ లేదా పిజ్జా సీజనింగ్ (ఆప్షనల్)
  • 1 స్పూన్ కొత్తిమీర 
  • 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ






తయారు చేసే విధానం:

Step 1: బ్రోకలీ మరియు స్వీట్ కార్న్ ఉడికించడం

  1. బ్రోకలీ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నీరు పోసి  అందులో బ్రోకలీ వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించాలి.
  3. ఉడికిన బ్రోకలీ ని తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. అలాగే, స్వీట్ కార్న్ ను కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

Step 2: వైట్ సాస్ తయారీ
5. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వెన్న వేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత తరిగిన వెల్లుల్లిపాయ వేసి వేగించాలి.
6. వెల్లుల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి (కాలిపోకుండా జాగ్రత్త).
7. ఇప్పుడు మైదా (లేదా ఓట్స్ పొడి) వేసి, కచ్చా వాసన పోయే వరకు రోస్ట్ చేయాలి.

Step 3: సాస్ క్రీమీగా చేయడం
8. పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి.
9. సాస్ మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి.

Step 4: సీజనింగ్స్ కలపడం
10. ఇప్పుడు మిరియాల పొడి, ఉప్పు, షుగర్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేయాలి.
11. ఇటాలియన్ సీజనింగ్ లేదా పిజ్జా సీజనింగ్ ఉంటే, అదనంగా వేసుకోవచ్చు.
12. ఇది బాగా మిక్స్ చేయాలి 

Step 5: బ్రోకలీ & కార్న్ కలపడం
13. ఇప్పుడు ఉడికించిన బ్రోకలీ, స్వీట్ కార్న్ వేసి మిక్స్ చేయాలి.
14. 2 నిమిషాలు ఉడికించాలి, అప్పుడే ఫ్లేవర్స్ బాగా కలిసి వస్తాయి.
15. ఐచ్చికంగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.

Step 6: సర్వ్ & ఎంజాయ్!
16. ఇలా వైట్ సాస్ బ్రోకలీ రెడీ! వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
17. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం, ఇందులో ఉడికించిన పాస్తా కూడా కలిపి పెట్టొచ్చు.






క్రీమీ & టేస్టీ వైట్ సాస్ బ్రోకలీ ని ట్రై చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 

ఈ రిసిపి నీ వీడియో రూపంలో చూడాలనుకుంటే

కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 

వైట్ సాస్ బ్రోకలీ


Comments

Popular Posts