How to make channa masala? High protein channa masala
ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఒక అద్భుతమైన కూర సెనగలతో, ఎర్ర సెనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ప్రోటీన్ ఎక్కువ శాతం లో ఉంటుంది. ఎదిగే పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం. ఎదిగే పిల్లలకు మాత్రమే కాదు అందరికీ ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపంవలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇటువంటి కూరలను ప్రతి రోజూ మన ఆహారం లో ఉండేలా చూసుకోవాలి.
చపాతీ, పూరీ లోనికి ఎప్పుడూ తినే బంగాళాదుంప కూర తో విసుగు చెంది ఉంటారు ఒక్క సారి సెనగలతో ఇలా కూర చేసి చూడండి, రుచి రుచి ఆరోగ్యం కూడాను.
సెనగలమసాలకూర
కావలసిన పదార్థాలు :
ఎర్ర సెనగలు ఒక కప్పు
టమాటా రెండు
బంగాళాదుంప ఒకటి
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
వెల్లుల్లి 10 రెబ్బలు
జీలకర్ర ఒక చెంచా
అల్లం చిన్న ముక్క
మిరియాలు 10
కారం ఒక చెంచా
పసుపు ¼ చెంచా
పెరుగు 2 చెంచాలు
కొత్తిమీర కొద్దిగా
ఉప్పు తగినంత
బిర్యానీఆకు ఒకటి
యాలకులు 2
నూనె 2 చెంచాలు
నెయ్యి ఒక చెంచా
తయారీ విధానం :
సెనగలను ముందుగా నాలుగు గంటలు నానబపెట్టుకోవాలి. నానపెట్టిన సెనగలను ఒక కుక్కర్ లో వేసి అందులో రెండు టమాటా లను, ఒక బంగాళాదుంప ఒక ఉల్లిపాయ,రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు నాలుగు వెల్లుల్లి వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం ముక్క,నాలుగు వెల్లుల్లి మరియు పది మిరియాలు వేసి బరకగా పట్టి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా ఉడికించుకొని ఉంచిన సెనగలలో కొన్ని సెనగలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
అలాగే సెనగలతో ఉడికించిన టమాటా ని బంగాళాదుంప ను కూడా కుక్కర్ లోనే ఉంచి లైట్ గా మాష్ చేసుకోవాలి
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో రెండు చెంచాల నూనె వేసి అందులో బిర్యానీఆకు, యాలకులు వేసి దోరగా వేయించి తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించాలి.
ఉల్లిపాయ మిశ్రమం వేగిన తరువాత అందులో కారం మరియు పసుపు వేసి కలిపి అందులోనే పెరుగు కూడా వేసి బాగా కలపాలి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో ఉడికించిన ఉంచిన సెనగలను దానితో పాటు మిక్సీ పట్టుకుని ఉంచిన సెనగలు పెస్టు వేసి 10 నిమిషాలు ఉడికించు కోవాలి
ఇలా ఉడికించిన కూర లో నెయ్యి వేసి కొత్తిమీర తురుము వేసి కలిపి రెండు నిమిషాలు పాటు ఉంచుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే చపాతీ, పూరీ లేదా జీరా రైస్ లోనికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఎర్ర సెనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ప్రోటీన్ ఎక్కువ శాతం లో ఉంటుంది. ఎదిగే పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం. ఎదిగే పిల్లలకు మాత్రమే కాదు అందరికీ ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపంవలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇటువంటి కూరలను ప్రతి రోజూ మన ఆహారం లో ఉండేలా చూసుకోవాలి.
0 Comments