Green peas Paneer curry//matar Paneer curry
How to make paneer green peas masala curry?
పన్నీరు లో ప్రొటీన్ ఎక్కువ గా ఉంటుంది అందరికి తెలిన విషయమే అలాగే ప్రొటీన్ మన శరీరానికి మరియు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. పన్నీరు ని ఇష్టపడని వారు ఎవరుఉండరు ఏ హోటల్ కి వెళ్ళిన వెజ్ తీనే వారు ఆర్డర్ చేసేది పన్నీరు కూర నే అలా అందరికి ఇష్టంగా ఉండే పన్నీరు బఠాణీ కూరని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఇటువంటి కూరలని కేవలం హోటల్ కి వెళ్ళే తినాలేమోని చాలా మంది అనుకుంటారు. కాని చాలా తేలికగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కూర చేయటం చాలా తేలిక కూర తయారీకీ కావరసిన పదార్థాలు అన్ని మనకు ఇంట్లోనే ఉంటాయి.
ఈ కూర చపాతీ, బటర్ నాన్ మరియు పుల్క లోకి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా జీరా రైస్ లోనికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు.
How to make Paneer green peas curry?బఠాణీ పన్నీరు కూర
కావలసిన పదార్థాలు :
3 టమాటోలు
3 ఉల్లిపాయలు
10 నుండి 15 జీడిపప్పు
చిన్న అల్లం ముక్క
10 మిరియాలు
3 యాలుకలు
¼ చెంచా సోంపు
3 పచ్చిమిర్చి
4 లవంగాలు
¼ చెంచా వెన్న
1 చెంచా నూనె
¼ చెంచా జీలకర్ర
1 బిర్యానీఆకు
¼ చెంచా పసుపు
½ చెంచా కాశ్మీరీ కారం(kashmiri red chilli powder)
ఉప్పు తగినంత
¼ చెంచా కసూరీ మెతీ
1 కప్పు పన్నీరు
½ కప్పు బఠాణీ (ఉడికించినవి) లేదా FROZEN PEAS
తయారీ విధానం :
ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నీటిని పోసి అందులో టమాటా, ఉల్లిపాయలు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, అల్లం మరియు పచ్చిమిర్చి వేసి 5 నిమిషాలు మరిగించాలి. అలా మరిగించిన తరువాత పొయ్యి ఆపి చల్లారనివ్వాలి.
చల్లారిన టమాటా, ఉల్లిపాయలు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, అల్లం మరియు పచ్చిమిర్చి అన్నింటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ½ చెంచా వెన్న మరియు 1చెంచా నూనె వేసి వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర మరియు బిర్యానీఆకు వేసి కొద్దిగా వేయించి తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచిన మిశ్రమాన్ని వేసి అందులో పసుపు, ఉప్పు, కాశ్మీరీ కారం వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి,3 నిమిషాలు తరువాత అందులో పన్నీరు ముక్కలు మరియు బఠాణీ మరియు కసూరీ మెతీ వేసి బాగా కలిపి మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉచికించు కోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే తేలికగా తయారు చేసుకునే బఠాణీ పన్నీరు కూర వడ్డించటానికి సిద్ధం.
ఈ కూర చపాతీ, బటర్ నాన్ మరియు పుల్క లోకి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా జీరా రైస్ లోనికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు.
గమనిక : ఈ మధ్య కాలంలో బఠాణీ లు రెడిమెడ్ గా దొరుకుతున్నది (frozen peas). Frozen peas తీసుకున్నట్లు అయితే ముందుగా ఉడికించుకొనే పని లేకుండా నేరుగా ఉపయెగించుకోవచ్చు. తాజావి వాడుతున్నట్లు అయితే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
Comments
Post a Comment