Seseme Seeds chikki//nuvvula chikki
నువ్వుల పట్టి//నువ్వుల చిక్కి
నువ్వుల యెక్క ఆరోగ్య పోషణ విలువలు అందరికీ తెలిసిందే. పైగ పిల్లలు కి కూడా తినిపించడంలో విఫలం అవుతున్నారు. కానీ ఎదో ఒక రకంగా పిల్లలకి తినిపించాలి ముఖ్యంగా ఎదుగుతున్న ఆడ పిల్లలలకు చాలా అవసరం.
వారి ఎముకల బలాన్ని పెంచుతుంది future లో చాలా problems లేకుండా చేస్తాయు
ఈ కింది విధంగా నువ్వులు కొంచెం జీడిపప్పు మరియు బాదం పప్పులు తో చిక్కిన తయారుచేసి పిల్లలకు ఇవ్వండి ఒకసారి తింటే రోజు తింటారు ఇష్టంగా తింటారు. వారి కావలసి కాల్షియం లభిస్తుంది.
కావలసిన పదార్థాలు:
నువ్వు లు 1/4 కేజీ
జీడిపప్పు 10 నుంచి 15
బాదం పప్పు 10 నుండి 15
బెల్లం 1/4 కేజీ
నెయ్యి రెండు చెంచాలు
తయారీ విధానం:
* పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నువ్వులు వేసి కొంచం రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
* అదే కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు, బాదం పప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
* పొయ్యి మీద గిన్నె పెట్టి బెల్లం తురుము వేసి కొంచెం నీరు పోసి కరిగించుకోవాలి.
* కరిగించిన బెల్లాన్ని వడపోసి పాకం వచ్చే వరకు మరిగించాలి.
*ముదురు పాకం రావాలి అలా వచ్చిన పాకం లో వేయించిన నువ్వులు, వేయించి ఉంచ్చుకున్న జీడిపప్పు, బాదం పప్పులు వేసి బాగా కలిపి. Stove off చేసుకోవాలి.
*ఈ విధంగా తయారు చేసిన నువ్వుల మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్ను plate మీద వేసి spread చేయాలి.
కొంచెం వేడిగా ఉండగానే ముక్కలు చేసుకోవడానికి గీత లు పెట్టి చల్లారపెట్టాలి.
చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసి ఎయిర్ టైట్ container లో నిల్వ చేసుకోవచ్చు.
పిల్లలు మాత్రమే కాకుండా ఆడవారు అందరూ తప్పక తినాలి. ఆడవారు అందరూ ఇంటిలో వాళ్లుకి చేసి పెట్టడంతో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదు ఇటువంటిది రోజు లో ఒక్క సారి అయినా తింటే ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Post a Comment