Healthy food //రాగి సంకటి , మిరపచారు

 

ఎప్పుడైనా కూరగాయలు లేక పోయినా లేదా కారంగా కూర తినాలని అనిపించినప్పుడు

ఈ మిరపచారు ని ప్రయత్నించండి

Healthy food రాగి సంకటి , మిరపచారు

పాతకాలంలో రాగి జావ, రాగి సంకటి లాంటివి ఎక్కువగా తినేవారు చాలా బలమైన ఆహారం కనుకనే అప్పటి వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇప్పుడు ఉన్న పిల్లలకు అటువంటి ఆహారం గురించి తెలియనుకూడా తెలియదు. ఎదో ఎడబ్బులు తక్కువ ఉన్న వారు తినే ఆహారం గా పరిగనిస్తారు. నిజానికి ఇప్పుడు ఇటువంటి ఆహారం ఖర్చు కూడా ఎక్కువ. 

         ఇప్పుడు ఇప్పుడే అందరు ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మద్య కాలంలో ఇటువంటి ఆహారం స్పెషల్ గా hotels కూడా ఉన్నాయి మంచి బిజినెస్ గా మారి పోయింది. 

 అంత మంచి ఆహారం ఇంట్లోనే తేలికగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. 

   

రాగి సంగటి 


కావలసిన పదార్థాలు :

  • రాగి పిండి :అర కప్పు 

  • బియ్యం : ఒక కప్పు 

  • నీళ్లు :నాలుగు కప్పులు 

తయారీ విధానం :

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు కప్పులు నీటిని పోసి ఉడికించాలి. 

  • అన్నం పొంగు వచ్చిన తర్వాత నీరు కొద్దిగా ఉండగా అన్నం కి మద్యలో రాగి పిండి ని వేసి ఉడుకుతుఉండే అన్నం తో కప్పి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత Stove off  చేసి రాగి పిండి అన్నం తో బాగా కలిసే లా కలపాలి. 

  • అంతే రాగి సంకటి రెడీ

మిరపచారు



కావలసిన పదార్థాలు :

  • ఎండు మిరపకాయలు: 15 నుండి 20 

  • జీలకర్ర :అర చెంచా 

  • చింత పండు :ఒక పెద్ద నిమ్మకాయ సైజంత

  • ఉల్లిపాయ :ఒకటి 

  • నీళ్లు :ఒక గ్లాసు 

  • ఉప్పు :తగినంత 

తయారీ విధానం :

  • ముందుగా చింత పండు ని ఒక పావుగంట సేపు నానబెట్టిన రసం తీసి పక్కన పెట్టుకోవాలి. 

  • ఇప్పుడు ఎండుమిర్చి ని direct గా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి లేదా పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఎండుమిర్చి వేసి రంగు మారే వరకు వేయించాలి. అందులో నే కొంచెం జీలకర్ర ని కూడా వేసుకోవాలి. 

  • చల్లారిన ఎండుమిర్చి లో ఉప్పు వేసి చేతితో నే నలుపుకోవాలి తర్వాత అందులో చింతపండు గుజ్జు వేసి కలపాలి 

  • ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపాలి. 


మిరపచారు సిద్ధం. ఈ మిరపచారు సంకటి లోకే కాదు అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది. 

       

        ఎప్పుడైనా కూరగాయలు లేక పోయినా లేదా కారంగా కూర తినాలని అనిపించినప్పుడు

ఈ మిరపచారు ని ప్రయత్నించండి. 

       ఇప్పుడు ఇప్పుడే అందరు ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మద్య కాలంలో ఇటువంటి ఆహారం స్పెషల్ గా hotels కూడా ఉన్నాయి మంచి బిజినెస్ గా మారి పోయింది. 


Comments

Post a Comment

Popular Posts