Indian traditional sweet//చలివిడి బెల్లం తో

 Indian telugu traditional sweet//చలివిడి బెల్లం తో 



  చాలా మంది తెలుగు వారు వారి వారి ఇంట్లో జరిగే చాలా శుభకార్యలలో ఈ చలివిడి ని తయారు చేస్తారు. 

చలివిడి, చలివిడి అందరూ పంచదారతో చేస్తూ ఉంటారు.   కానీ బెల్లం తో ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.

కావలసిన పదార్థాలు:

*తడి బియ్యం పిండి రెండు కప్పులు

* బెల్లం ఒక కప్పు

* ఎండుకొబ్బరి ముక్కలు

* నెయ్యి పావు కప్పు

*  గసగసాలు అరచెంచా

తయారీ విధానం:

*  ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానపెట్టాలి.

* మరుసటి రోజు ఉదయం నాన పెట్టిన బియ్యం నుండి నీటిని తీసి మర పట్టించుకోవాలి

      లేదా

*ఇంట్లోనే మిక్సీ జార్ లో వేసి మెత్తగా పట్టుకోవాలి,ఒకసారి మిక్సీ పట్టిన పిండిని జల్లించి, మిగిలిన రవ్వని మరల మిక్సీ పట్టుకోవాలి.

 *బియ్యం పిండి చాలా మెత్తగా ఉండాలి.

* ఇప్పుడు మరో గిన్నె పొయ్యి మీద ఉంచి అందులో బెల్లం వేసి బెల్లం మునిగేలా నీటిని పోయాలి, బెల్లం కరిగి లేత పాకం రానివ్వాలి. 

*పాకం వచ్చిన తర్వాత అందులో 2 చెంచాలు నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. 

*ఇప్పుడు పాకం లో బియ్యం పిండి ని కొంచెం కొంచెం గా వేస్తూ ఉండలు కుట్టకుండా కలపాలి చలివిడి మరీ పలుచగా కాకుండా మరియు మరీ గట్టిగా ఉండకూడదు. 

*మరో గిన్నెలో 1 చెంచా నెయ్యి వేసి అందులో ఎండుకొబ్బరి ముక్కలు మరీయు గసగసాలు వేసి వేయించి తయారు చేసుకున్న చలివిడి లో కలపాలి. 

    

   ఎంతో రుచిగా ఉండే చలివిడి బెల్లం తో సిద్ధం. 


గమనిక :పాకం పరీక్షీంచే విధానం ఒక గిన్నెలో కొంచెం నీటిని తీసుకుని అందులో పాకం వేసి దానిని మనం ఒక చిన్న ఉండలాగా తీయగలగాలి. అది మరీ గట్టిగా ఉండరాదు. 

Comments

Popular Posts