How to make Mushroom curry//నాటు పుట్ట గొడుగుల తో కూర
Mushroom curry
నాటు పుట్ట గొడుగులు కూర :వర్షాకాలంలో మాత్రమే దొరికే పుట్ట గొడుగుల లతో నోరు ఊరించే పుట్ట గొడుగుల కూర.
D విటమిన్ లోపం తో చాలా మంది ఇప్పటి కాలంలో భాధ పడుతున్నారు. ద విటమిన్ దొరికే ఒకే ఒక వెజిటబుల్ పుట్ట గొడుగులు.
కావలసిన పదార్థాలు:
*పుట్టగొడుగులు 2 కట్టలు
*ఉల్లిపాయ ఒకటి
*ధనియాలు ఒక చెంచా
*జీలకర్ర ఒక చెంచా
*బియ్యం ఒక చెంచా
*పాలు 1/2 కప్పు
*ఉప్పు తగినంత
*1 చెంచా కారం
*1/2 చెంచా పసుపు
* నూనె 3 చెంచాలు
తయారీ విధానం:
* ముందు గా పుట్ట గొడుగులను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు మసాలా తయారీ కి పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర మరియు బియ్యం వేసి దోరగా వేయించి అవి చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాత మిక్సీ లో వేసి మెత్తగా పట్టుకోవాలి.
*మరో గిన్నెను పొయ్యి మీద ఉంచి అందులో నూనె వేసి కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి అవి వేగిన తరువాత అందులో కట్ చేసి ఉంచిన పుట్టగొడుగులు, పసుపు మరియు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
*5 నిమిషాలు ల తర్వాత పుట్ట గొడుగుల నుండి నీరు విడుదల అవుతోంది ఆ నీరు కొద్దిగా తగ్గిన తర్వాత అందులో కారం వేసి ఉడికించుకోవాలి.
*మరో 5 నిమిషాలు ఉచికించు కొన్న తర్వాత అందులో నీరు బాగా తగ్గుతుంది. అప్పుడు అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాలు తర్వాత ముందుగా పట్టి ఉంచ్చుకున్న మసాలా వేసి బాగా కలపాలి మరే 5 నిమిషాలు ఉడికించుకోవాలి, ఇక్కడ ఒకసారి ఉప్పు ని చూసుకోని సరిపోకపోతే వేసుకుని 5 నిమిషాలు ఉడికించిన స్టవ్ ఆఫ్ చేయాలి.
*ఈ కూర చల్లారిన తరువాత అందులో పాలు పోసి కలిపితే నాటు పుట్ట గొడుగుల కూర సిద్ధం.
ఈ కూరా లో పాలు, పాలు పడని వారు ఉంటే పాలని skip చేసుకోవచ్చు.
పాలు వాడక పోయినా కూర చాలా రుచిగా ఉంటుంది.
D విటమిన్ లోపం తో చాలా మంది ఇప్పటి కాలంలో భాధ పడుతున్నారు. ద విటమిన్ దొరికే ఒకే ఒక వెజిటబుల్ పుట్ట గొడుగులు.
అందులో ను నాటు పుట్ట గొడుగుల లో పుష్కలంగా ఉంటుంది కావున వర్షాలు కురిసే సమయంలో ఇవి చాలా ఎక్కువగా దొరుకుతుంది.
Comments
Post a Comment