RAGI ROTI //Healthy Recipe for strong bones

 

How to make ragi roti? 

ఎంతో రుచిగా మరియి తేలికగా తయారు చేసుకునే రాగి రొట్టె ఎల తయారు చేసుకోవాలో  



 రాగి రొట్టె 

      రాగులు ఆరోగ్యకరమైన బలమైన ఆహారం రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రాగులు ను చిన్నప్పటినుంచి పిల్లలకు వాళ్ల రోజువారీ ఆహారం లో ఉండేలా చేస్తే వారి ఎముకలు చాలా దృఢంగా తయారు అవుతాయి. 

       చాలా మంది అమ్మాలు వారి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రాగి జావ ను తినిపిస్తారు. కాని వారి వయస్సు పెరిగే కొద్దీ పిల్లలు రక రకాల చిరు తిండ్ల కి అలవాటు పడి ఇటువంటి బలమైన ఆహారం పైన మెగ్గు చూపటంలేదు. కానీ ప్రతి తల్లి ఇప్పుడు ఉండే రోగాలు లను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఆహారపదార్దాలను పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి. 

Ragi roti in telugu:

ఎంతో రుచిగా మరియి తేలికగా తయారు చేసుకునే రాగి రొట్టె ఎల తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 


కావలసిన పదార్థాలు 

రాగి పిండి అర కప్పు 

ఉల్లిపాయ ఒకటి 

కొత్తిమీర కొద్దిగా 

కరివేపాకు రెండు రెమ్మలు 

పర్చిమిర్చి రెండు 

ఉప్పు తగినంత 

నూనె 2 చెంచాలు 

తయారీ విధానం 


*ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొత్తిమీర మరియు కరివేపాకు ను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 

*ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండి వేసి అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్ను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు కరివేపాకు వేసి కలిపి కొద్దిగా కొద్దిగా నీళ్ళు పొస్తూ గట్టిగా ముద్ద లాగా చేసుకోవాలి. 

*ఈ విధంగా కలిపిన ముద్ద ని చిన్న చిన్న ఉండలు గా చేసి ఒక తడి బట్ట మీద చెతితో పల్చగా ఒత్తుకోవాలి. 

*ఈలా ఒత్తుకున్న రాగి రొట్టె ని పెనం మీద ఉంచి రెండు పక్కలా బాగా కాల్చుకోవాలి. మద్యలో ఒక చెంచా నూనె వేసి కాల్చుకోవాలి. 

 

అంతే ఎంతో రుచిగా ఉండే తేలికగా తయారు చేసుకునే ఆరోగ్యకరమైన రాగి రొట్టె సర్వే చేయటానికి రెడీ. 

        ఈ రాగి రొట్టె ఇలాగే చేయాలని ఏమి రూల్స్ లేవు మరింత ఆరోగ్య కరంగా చేయాలనుకుంటే రాగి పిండిలో ఏదైనా ఆకుకూరలు మీకు నచ్చిన మసాలాలను వేసి మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. 

        ఏదైనా రోటి పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది. 


Comments

Popular Posts