Skin:Vegetable Juice //Best juice for skin problems
The best juices for health
ఈ రెండు జ్యూస్ లను పిల్లలకు చిన్నప్పటినుంచి అలవాటు చేయడంవలన మన పిల్లలకు మనం మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కనుక ఇటువంటి ఆరోగ్యకరమైన జ్యూస్ ని తప్పక ప్రయత్నించండి.
వెజిటబుల్ జ్యూస్
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఈ వెజిటబుల్ జ్యూస్ ఈ జ్యుస్ రోజు తీసుకోవటం వలన స్కిన్ గ్లో వస్తుంది ఒంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నింటి తొలగించడంలో ఉపయోగపడుతుంది. జ్యూస్ తయారీ
కావలసిన పదార్థాలు
కీర దోసకాయ :రెండు
క్యారెట్ :రెండు
బీట్రూట్ చిన్నది :ఒకటి
నిమ్మకాయ :ఒకటి
అల్లం :చిన్న ముక్క
తేనె :మూడు చెంచాలు
నీళ్లు :ఒక గ్లాసు
తయారీ విధానం :
కీయ దోసకాయ, క్యారెట్ మరియు బీట్రూట్ ని శుభ్రం గా కడిగి తొక్కి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి అల్లం ముక్క మరియు నిమ్మరసం కూడా పిండి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా మెత్తగా పట్టుకోవాలి.
ఈ విధంగా పట్టిన జ్యూస్ ని వడపోసి అందులో తేనను కలిపి సర్వ చేసుకోవాలి.
పైన చెప్పిన కొలతలో చేసిన ఈ జ్యుస్ ని ముగ్గురికి సర్వ చేయగలం.
బీట్రూట్ జ్యూస్
రక్త వృద్ధి కి మరియు చర్మం మృదువుగా మారటానికి మరియు చర్మం కళ గా మారటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బీట్రూట్ ని పచ్చి గా జ్యూస్ గా తీసుకుంటే కొద్దిగా వగరుగా ఉంటుంది వగరుతనం తగ్గి జ్యూస్ రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేయండి
కావలసిన పదార్థాలు :
బీట్రూట్ :రెండు (మీడియం సైజ్)
అల్లం : చిన్న ముక్క
తేనె :రుచికి సరిపడా
నీళ్లు :2 గ్లాసులు
తయారీ విధానం :
బీట్రూట్ ని శుభ్రం గా కడిగి తొక్కి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి దీనితో పాటు అల్లం కూడా వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి హై స్పీడ్ లో తిప్పి బాగా మెత్తగా పట్టుకోవాలి.
ఈ విధంగా పట్టిన జ్యూస్ ని వడపోసి అందులో తేనను కలిపి సర్వ చేసుకోవాలి.
ఈ బీట్రూట్ జ్యూస్ ని పైన చెప్పిన కొలతలో చేసినట్లు అయితే ఇద్దరికి సర్వ చేయగలం.
అంతే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ జ్యూస్ రెడి అల్లం వేయటం వల్ల రుచి పెరగడం తో పాటు బీట్రూట్ వగరు కుడా తగ్గి జ్యూస్ తాగడానికి చాలా రుచిగా ఉంటుంది.
రక్త హీనత తో బాధపడుతున్న వారికి క్రమంతప్పకుండా ఈ జ్యుస్ ఇవ్వడం వలన రక్తం త్వరగా వృద్ధి జరిగి వారు రక్తహీనత సమస్య నుండి త్వరగా బయట పడవచ్చు.
పైన చెప్పిన ఈ రెండు జ్యూస్ లను పిల్లలకు చిన్నప్పటినుంచి అలవాటు చేయడంవలన మన పిల్లలకు మనం మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కనుక ఇటువంటి ఆరోగ్యకరమైన జ్యూస్ ని తప్పక ప్రయత్నించండి.
Comments
Post a Comment