HERBAL TEA//Drink to increase immunity power

 

Morning drink for weight loss //improve immunity

కాఫీ, టీ అలవాటు ఉన్న వారు వాటిని మానలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కాని మాన లేక ఇబ్బందులు పడుతుంటారు. కాఫీ, టీ లకు బదులుగా ఈ herbal టీ ని ప్రయత్నించండి.



హెర్బల్ టీ


కాఫీ, టీ అలవాటు ఉన్న వారు వాటిని మానలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కాని మాన లేక ఇబ్బందులు పడుతుంటారు. కాఫీ, టీ లకు బదులుగా ఈ herbal టీ ని ప్రయత్నించండి. ఈ టీ తో మరొక ఉపయోగం కూడా ఉంది అది బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారికి. ఇప్పుడు టీ తయారీ విధానం చూద్దాం. Immunity drink

కావలసిన పదార్థాలు :

  • నీళ్లు మూడు గ్లాసులు 

  • దాల్చినచెక్క 

  • అల్లం ముక్క 

  • అర చెంచా ధనియాలు

  • పావు చెంచా సోంపు 

  • మిరియాలు 10 నుండి 15

  • నిమ్మకాయ ఒకటి 

  • తేనె రెండు చెంచాలు 

  • తులసి ఆకులు పావుకప్పు 

తయారీ విధానం :

         పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నీటిని పోసి అందులో అల్లం, దాల్చినచెక్క, దనియాలు, సోంపు, మిరియాలు మరియు తులసి ఆకులు వేసి మరిగించాలి. మూడు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసులు అయ్యే వరకు మరిగించాలి. అలా మరిగించిన టీని Stove off చేసి అందులో నిమ్మరసం మరియు తేనను వేసి కలిపాలి వడపోసుకుని సర్వచేసుకోవడమే. 

       ఆరోగ్య కరమైన తేనీరు (immunity drink టీ) తయారు. 


 ఈ టీ చాలా రుచిగా ఉంటుంది టీ కాఫీ లకు ప్రత్యమ్నాయం గా తీసుకుంటే ఆరోగ్యం కూడా

 దీనిని పిల్లలుకు కూడా ఇవ్వవచ్చు. పిల్లల్లో జలుబు, దగ్గు ఉన్నప్పుడు దీనిని ఇవ్వటం వలన వారికి జలుబు వంటి వాటి నుండి ఉపసమనంకలుగుతుందీ. 

     ఈ టీ వలన ఎటువంటి దుష్ప్రభావం ఉండదు.

  బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారికి ఇది ఒక మంచి పానియం ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా ఈ టీ ని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. 


గమనిక :అల్లం మరియు మిరియాల ని కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది. 

      అలాగే పైన చెప్పిన కొలతలో ఈ టీ ని తయారు చెసుకుంటే ముగ్గురు తాగవచ్చు. 

తప్పకుండా ఈ herbal tea (immunity drink) ని ప్రయత్నించండి మంచి ఫలితాలు ఉంటాయి. 

Comments

Popular Posts