Best evening snacks//Sweet Corn recipes //కార్న్ రెసిపీస్
సాయంత్రం పూట స్నాక్ ఐటం ఏమిచేయాల అని ఆలోచనలో ఉన్నట్లు అయితే బెస్ట్ ఆప్షన్.
చలికాలంలో వేడిగా ఎదో ఒకటి తినాలని అనిపించినప్పుడు స్నాక్స్ చేసే ఓపిక లేదు అంటే, పిల్లలు సూప్ అడిగితే వెంటనే ఈ సూప్ తయారు చేయండి.
కార్న్ సూప్
కావలసిన పదార్థాలు :
ఒక కప్పు స్వీట్ కార్న్ ( మొక్కజొన్న)
ఒక క్యారెట్
ఒక ఉల్లిపాయ
5 వెల్లుల్లి
చిన్న ముక్క అల్లం
నాలుగు బీన్స్
2 పచ్చిమిర్చి
½ చెంచా మిరియాల పొడి
½ చెంచా కార్న్ ఫ్లోర్
2 కప్పు ల నీళ్లు
ఒక చెంచా నూనె
తయారీ విధానం :
ముందుగా మొక్కజొన్న (స్వీట్ కార్న్) ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన మొక్కజొన్న లో కొద్దిగా (2చెంచాల) పక్కకు తీసి మిగిలిన వాటిని మిక్సీ లో వేసి కొంచం నీళ్లు పోసి మెత్తగా పట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, అల్లం, మరియి బీన్స్ అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 1చెంచా నూనె వేసి కాగాక అందులో ముందుగా వెల్లుల్లి ముక్కలు మరియు అల్లం ముక్కలు వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు క్యారెట్ ముక్కలు వేసి వేగించాలి
తరువాత అందులో ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచిన కార్న్ పెస్టు వేసి 2 కప్పు ల నీళ్లు పోసి మరిగించాలి.
10 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మరో 5 నిమిషాలు మరిగించాలి.
ఆఖరిగా సూప్ చిక్కగా అవటానికి ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ని తీసుకుని దాని లో నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న సూప్ లో వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించిన స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే కార్న్ సూప్ సర్వ్ చేయటానికి సిద్ధం.
కార్న్ పకోడి
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు 2 కప్పులు(corn)
శెనగపిండి ½ కప్పు
బియ్యం పిండి 2 చెంచాలు
పచ్చిమిర్చి నాలుగు
అల్లం చిన్న ముక్క
కొత్తిమీర కొద్దిగా
ఉప్పు తగినంత
దనియాలు పొడి1 చెంచా
గరం మసాలా ½ చెంచా
నూనె deep fry కి సరిపడా
తయారీ విధానం :
ముందుగా మొక్కజొన్న ని(corn) ఒక మిక్సీ జార్ లో వేసి అందులో పచ్చిమిర్చి మరియు అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న కార్న్ ని ఒక గిన్నెలో తీసుకుని అందులో కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, దనియాలపొడి, గరం మసాలా, అరకప్పు శెనగపిండి మరియు 2 చెంచాల బియ్యం పిండి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో deep fry కి సరిపడా నూనె పోసి కాగాక అందులో ముందుగా కలిపి ఉంచుకున్న మొక్కజొన్న (corn) మిశ్రమాన్ని పకోడిల మాదిరిగా నూనె లో వేసి medium flame లో వేయించుకోవాలి. మంచి రంగు వచ్చేవరకు వేయించాలి.
మంచి రంగు వచ్చిన తర్వాత తీస్తే కార్న్ పకోడి రెడీ ఏదైన చట్నీ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
సాయంత్రం పూట స్నాక్ గా చాలా బాగుంటుంది.
Comments
Post a Comment