How to make mysorepak at home easily in telugu
పండుగ సందడి అందరి ఇంట్లో మెదలైంది. పండుగ సందర్భంగా పిండి వంటలు చేయటం మెదలుపెట్టే ఉంటారు.
చాలా మంది కి మైసూర్ పాక్ అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ చేయటానికి చాలా సమయం పడుతుందని ఇంట్లోనే చేయడానికి ప్రయత్నాం చేయకుండా స్వీట్ షాపులు నుండి తీసుకుని వస్తూంటారు.
ఇప్పుడు ఇక్కడ మైసూర్ పాక్ ని తేలికగా చేసుకునే విధానం చూద్దాం. ఏంతో రుచిగా ఉంటుంది పైగా మన చేతులతో మనమే స్వయంగా చేసుకుంటారు కాబట్టి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అదే బయటనుండి తీసుకువస్తే నూనె వాడారో ఏ నెయ్యి వాడారో అనే ఆలోచన ఉంటుంది.
హోం మేడ్ మైసూర్ పాక్ తయారీ కి
Home made mysorepak
కావలసిన పదార్థాలు
- ఒక కప్పు శెనగపిండి
- ఒక కప్పు పంచదార
- రెండు కప్పులు నెయ్యి
- పావు గ్లాసు నీళ్లు
- ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఒక కప్పు శెనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- మరో గిన్నెలో అర కప్పు నెయ్యి వేసి కరిగించి, కరిగించిన నెయ్యి ని వేయించి ఉంచుకున్ను శెనగపిండి లో వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పొయ్యి మీద మరో కడాయి పెట్టి అందులో ఒక కప్పు పంచదార వేసి పంచదార తడిసే లాగా నీటి ని పోసి పంచదారని కరిగించుకోవాలి.
- పంచదార కరిగిన తరువాత అందులో ముందుగా కలిపి ఉంచుకున్న నెయ్యి, శెనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి.
- ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో ఒక కప్పు నెయ్యి వేసి శెనగపిండి ఈ నెయ్యి మొత్తం పీల్చుకునే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి.
- ఇలా సుమారుగా పావుగంట పాటు కలుపుతూ ఉండాలి.
- తరువాత మిగిలిన ఉన్న అరకప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. ఒక పావుగంట తర్వాత మైసూర్ పాక్ నెయ్యి వదలటం మెదలవుతుంది.
- ఇలా నెయ్యి వదిలేటప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఒక ప్లేట్ మీద నెయ్యి రాసి రెడిగా ఉన్న మైసూర్ పాక్ వేసి ప్లేట్ ని నిదానంగా టాప్ చేయాలి.,అప్పుడు ప్లేట్ లో మైసూర్ పాక్ సమంగా పరుచుకుంటుంది.
- ఇలా తయారు అయిన మైసూర్ పాక్ ని 10 నిమిషాలు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
గమనిక :ఈ మైసూర్ పాక్ తయారీ సుమారు గా ముప్పావు గంట సమయం పడుతుందని.
- కాస్త ఓపిక తో తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే నేతి మైసూర్ పాక్ మనమే తయారు చేసుకోవచ్చు.
1 Comments
Yummy @❤️
ReplyDelete