Uggani recipe in telugu

ఉదయం టిఫిన్ గా (breakfast) లేదా సాయంత్రం స్నాక్స్ లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. 

       ఉగ్గాని 


రాయల సీము ఎంతో ప్రత్యేకమైన వంటకం  "ఉగ్గాని". దీనితో మిరపకాయ బజ్జి ఎంతో రుచిగా ఉంటుంది.


"ఉగ్గాని" ని మరమరాలు (puffed rice) తో తయారు చేస్తారు. 


ఉగ్గాని తయారీకి కావలసిన పదార్థాలు తయారీ 


విధానం తెలుసుకుందాం. 


కావలసిన పదార్థాలు :



  • కొత్తిమీర కొద్దిగా


  • ఒక ఉల్లిపాయ 


  • ఉప్పు - తగినంత


  • 2 కప్పుల మరమరాలు


  • రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు


  •  పసుపు - 1 చెంచా 


  •  ఒక నిమ్మకాయ


  • రెండు చెంచాల వేరు శనగ పప్పు

 

  • రెండు చెంచాల పల్లీలు | 


  • ఒక చెంచా జీలకర్ర 


  • 2 చెంచా నూనె 


తయారీ విధానం:


  • ముందుగా వేరు శెనగపప్పు, 3 పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. 


  • ఒక పెద్ద గిన్నెలో నీటి ని పోసి మరమరాలను వేసి బాగా తడిపి నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. 


  • ఉల్లి పాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్  చేసుకోవాలి.



  • పొయ్యి మీద ఒక పాత్రను ఉంచి అందులో నూనె వేసి వేడి అయిన తరువాత అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి,పల్లీలు వేగిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో తడిపి ఉంచుకున్న మరమరాలు, పసుపు కొంచెం మరియు మిక్సీ పట్టి ఉంచుకున్న వేరుశనగ పప్పుల పొడి, తగింత ఉప్పు వేసి బాగా కలపాలి. 


  • స్టౌ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి సర్వ చేసుకోవాలి. 




   సర్వ చేసే ముందు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 

ఈ ఉగ్గాని కేవలం ఆంధ్ర వంటకం మాత్రమే కాదు. 

ఉత్తర కర్ణాటక లో కూడా చాలా ప్రసిద్ధ వంటకం. 


Puffed rice మరమరాలతో చేసే ఈ ఉగ్గాని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు మరియు చాలా రుచిగా ఉంటుంది. 


ఉదయం టిఫిన్ గా (breakfast) లేదా సాయంత్రం స్నాక్స్ లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది.