Dal vada//Protein vada//Best snack

 How to make protein rich dal vada in telugu



పప్పుల వడ


పెసలు, పెసరపప్పు మరియు పచ్చి శనగపప్పు ఈ మూడింటిని ఉపయోగించి ఒకమంచి ఆరోగ్యకరమైన స్నాక్ ఇప్పుడు చూద్దాం.
ఉదయం టిఫిన్ గా చేయాలని అంటే రాత్రికి నానబెట్టుకోండి లేదా సాయంత్రం స్నాక్స్ లా చేయాలి అంటే ఉదయం నానబెట్టండి. 

ఇప్పటి కాలం పిల్లలు ఇటువంటి వంటలు తినడానికి ఇష్టపడరు కాని ఈ వడ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు తప్పనిసరిగా తింటారు. 

కావలసిన పదార్థాలు :
  • పెసలు ఒక కప్పు 
  • పెసరపప్పు ఒక కప్పు 
  • పచ్చి శనగపప్పు ఒక కప్పు 
  • అల్లం చిన్న ముక్క 
  • పచ్చిమిర్చి నాలుగు 
  • దనియాలు ఒక చెంచా 
  • సోంపు ½ చెంచా 
  • ఉప్పు తగినంత 
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా 
  • ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు 
తయారీ విధానం :
  1.  ముందుగా పెసరపప్పు, పెసలు మరియు పచ్చి శనగపప్పు ని శుభ్రం గా కడిగి నీళ్ళు పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టుకోవాలి. 
  2. అలా నానపెట్టిన పప్పులు లను 3 గంటల తరువాత నీటిని తీసి ఒక మిక్సీ జార్ లో వేసి పప్పుల తో పాటు అల్లం ముక్క, సోంపు, పచ్చిమిర్చి మరియు ధనియాలు వేసి నీటిని పోయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. 
  3. ఈ విధంగా పట్టిన పప్పుల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి. 
  4. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో deep fry సరిపడా నునె పోసి
  5. నూనె కాగిన తరువాత అందులో మందుగా సిద్ధంగా ఉన్న పప్పుల మిశ్రమాన్ని చిన్న చిన్న వడల మాదిరిగా చేసి నూనె లో వేసి medium flame లో ( పొయ్యి మంట మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఉండాలి.) మంచి రంగు వచ్చేవరకు వేయించాలి. 

అంతే ఎంతో రుచిగా ఉండే dal vada పప్పుల తో వడ తినడానికి సిద్ధం. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. 
        ఇప్పటి కాలం పిల్లలు ఇటువంటి వంటలు తినడానికి ఇష్టపడరు కాని ఈ వడ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు తప్పనిసరిగా తింటారు. 
     

   ఒక వేళ పిల్లలు ఏదైనా ఆకుకూరలు తినను అని మారం చేస్తుంటే ఈ పప్పుల మిశ్రమంలో ఎదో ఒక ఆకుకూర పాలకూర లేదా మెంతి కూర 
చిన్న గా కట్ చేసి కలిపి వడలు వేస్తే ఇంకా రుచిగా కూడా ఉంటాయి. కేవలం ఆకుకూరలు మాత్రమే కాకుండా క్యారెట్ తురుము కూడా ఉపయోగించవచ్చు. 

      Deep fry ఇష్టం లేదు అంటే ఇదే మిశ్రమాన్ని పొంగానాల గా కూడా వేసుకోవచ్చు. 

ఇదే మిశ్రమాన్ని కొంచెం నీటిని పోసి మరింత మెత్తగా నూరి దోశ లాగా కూడా వేసుకోవచ్చు. 

Also Read



Post a Comment

0 Comments